రైతులకు పెట్టుబడి సాయం అందించే పీఎం కిసాన్ నిధులను ప్రధాని మోదీ బిహార్లోని బాగల్పూర్లో విడుదల చేశారు. దేశంలోని 9.7 కోట్ల మంది రైతులకు 2019 నుంచి కేంద్ర ప్రభుత్వ ఏటా రూ.6 వేలు, మూడు విడతలుగా విడుదల చేస్తోంది. ఇప్పటి వరకు 18 విడతలు నిధులు విడుదల అయ్యాయి. తాజాగా 19వ విడత రూ.22 వేల కోట్లను ప్రధాన మోదీ విడుదల చేశారు. దీని ద్వారా రైతులకు రూ.2 వేల సాయం అందనుంది.
రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సాయం అందించేందుకు పలు పథకాలు ప్రవేశపెట్టాయి. ఆ పథకాల నిధులతో కలిపి పీఎం కిసాన్ నిధులు జమ చేసే అవకాశముంది. ఏపీలో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఒక్కో రైతుకు రూ.20 వేలు ఇచ్చేందుకు ఏపీ #pmkisan ప్రభుత్వం సిద్దమవుతోంది. ప్రధాన మంత్రి కిసాన్ నిధులు వాటితో కలిపి రైతులకు ఇచ్చే అవకాశముంది.