శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదోరోజున ఆదిదంపతులు రావణవాహనంపై నుంచి భక్తులను కటాక్షించారు. ఈ వాహనసేవను వీక్షిస్తే భక్తుల్లో భక్తిభావం పెరగడంతో పాటు శివకటాక్షం లభిస్తుందని పురాణాల్లో పేర్కొన్నారు.