ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా దుబాయ్ వేదికగా పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. తొలుత టాస్ నెగ్గి బ్యాటింగ్ చేసిని పాకిస్తాన్, 49.4 ఓవర్లలో 241 పరుగులు చేసి ఆలౌటైంది.
పాకిస్తాన్ ఇన్నింగ్స్ లో సౌద్ షకీల్ (62) టాప్ స్కోరర్ గా ఉన్నాడు. మహమ్మద్ రిజ్వానా (46), కుష్దిల్ షా( 38) భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజామ్ , సల్మీన్ అఘా, తయ్యాబ్ తాహిర్, నసీమ్, షాహీన్ అఫ్రిదీ విఫలమయ్యారు.
భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు తీయగా,హర్దిక్ పాండ్యా రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా తలా ఒక వికెట్ తీశారు.
లక్షఛేదనలో భారత్ ఏమాత్రం తడబడకుండా నిలకడగా ఆడి విజయం సాధించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభమన్ గిల్ మంచి ఆరంభమిచ్చారు. రోహిత్ శర్మ్ (20) తొలి వికెట్ గా స్కోర్ బోర్డు 31 వద్ద ఉన్నప్పుడు వెనుదిరిగాడు. షాహిద్ అఫ్రీది వేసిన ఐదో ఓవర్ లో బౌల్డ్ అయ్యాడు.
ఆ తర్వాత శుభమన్ గిల్ తో కలిసి , విరాట్ కోహ్లీ స్కోర్ బోర్డును పరిగెత్తించాడు. గిల్ 52 బంతుల్లో 46 పరుగులు చేసి అబ్రార్ అహ్మద్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులో 67 బంతుల్లో 56 పరుగులు చేశాడు. 17.3 బంతికి గిల్ వెనుదిరగగా, కుష్దీల్ షా వేసిన 38.5 బంతికి శ్రేయస్ అయ్యర్(56) ఔట్ అయ్యాడు. దీంతో 214 పరుగుల వద్ద భారత్ మూడో వికెట్ నష్టపోయింది. ఆ తర్వాత 40 వ ఓవర్ లో హర్దిక్ పాండ్యా (8) నిరాశపరిచాడు. షాహీన్ అఫ్రీది బౌలింగ్ లో క్యాచ్ ఔట్ గా వెనుదిరిగాడు.
విరాట్ కోహ్లీ సెంచరీ…
విరాట్ కోహ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్ కు దిగి 111 బంతులు ఎదుర్కొని సెంచరీ చేశాడు.
పాకిస్తాన్ బౌలర్లలో షాహీన్ అఫ్రీది రెండు వికెట్లు తీయగా అబ్రార్ అహ్మద్, కుష్దిల్ షా చెరొక వికెట్ తీశారు.
ఢిల్లీ విమానాశ్రయ అధికారులపై జమ్ము కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్ర ఆగ్రహం