మహాశివరాత్రి సందర్భంగా కాశీవిశ్వేశ్వరుణ్ణి ఎక్కువమంది భక్తులు దర్శించుకునేలా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఫిబ్రవరి26న తొలి మంగళహారతి, 27న జరిగే శయన హారతి వరకూ భక్తులు నిరంతరంగా మహాశివుణ్ణి దర్శించుకోవచ్చు. పార్వతీ పరమేశ్వరుల సుమారు కళ్యాణం ఎనిమిది గంటలపాటు జరగనుంది.
కాశీ విశ్వనాథుడుని ఆలయ అధికారి విశ్వభూషణ్ మాట్లాడుతూ ఫిబ్రవరి 25న శయన హారతి తర్వాత గర్భగుడిని మూసివేసి 26న తెల్లవారుజామున 2:30కి మంగళహారతి ఇస్తామన్నారు. దీని తర్వాత దర్శనాలు ఉంటాయన్నారు. ఫిబ్రవరి 27న జరిగే శయన హారతివరకూ ఆలయం తలుపులు తెరిచే ఉంటాయని వివరించారు.
మహా శివరాత్రివేళ సప్తరుషి శృంగార హారతి ఇవ్వనున్నారు. ఫిబ్రవరి 26న రాత్రి 8 గంటలపాటు శివపార్వతుల కళ్యాణం జరగనుంది. మహాశివరాత్రికి 14 లక్షలకు పైగా భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేశారు.