ఏపీలో మార్చి నుంచి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయనున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. క్యూ ఆర్ కోడ్ ఉన్న కార్డులు జారీ చేస్తామని చెప్పారు.
వచ్చే నెల నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేయడంతో పాటు కార్డుల్లో మార్పులు, చేర్పులకు అవకాశం కల్పిస్తామన్నారు. అన్ని గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు అని వివరించారు.
ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న దీపం-2 పథకం హామీని సీఎం చంద్రబాబు నెరవేర్చారని, రాష్ట్రంలో 93.42 లక్షల మందికి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని, ఈ ఏడాది 1.50 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు లెక్కలతో వివరించారు.
ఆంధ్రప్రదేశ్ లో కోటి నలభై లక్షల తెల్ల రేషన కార్డులు ఉండగా వీటిల్లో 90 లక్షల కార్డులను కేంద్ర ఆహారభద్రతా చట్టం కింద జారీ చేశారు. బియ్యం, కందిపప్పు, పంచదారను తక్కువ ధరకు ఈ కార్డుపై పంపిణీ చేస్తున్నారు.