ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. సమావేశాల్లో భాగంగా తొలి రోజు గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ సభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
తర్వాత సభ మరుసటి రోజుకు వాయిదా వేస్తారు. అదేరోజు శాసనసభ, శాసనమండలి వ్యవహారాల సలహా కమిటీలు భేటీ సమావేశాలను ఎన్ని రోజులపాటు నిర్వహించాలి, ఏ రోజు ఏ అంశంపై చర్చించాలనే విషయాలను ఖరారు చేస్తారు.
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై 25న చర్చ లో భాగంగా చివర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానమిస్తారు. 26న శివరాత్రి, 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో సభలకు సెలవు ప్రకటించారు.
28న ఉదయం అసెంబ్లీ ఆవరణలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేటినెట్ భేటీ జరగనుంది. అందులో బడ్జెట్‌కు లాంఛనంగా ఆమోదముద్ర తెలిపి అదే రోజు వార్షిక బడ్జెట్‌ను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది.మార్చి 3న సభ పునఃప్రారంభమవుతుంది.
సమావేశాల రీత్యా అసెంబ్లీ ఆవరణలోకి ప్రవేశాలను కట్టుదిట్టం చేసినట్లు సభ్యులకు అధికారులు తెలిపారు. బ్యానర్లు, ప్లకార్డుల ప్రదర్శన చేయరాదని స్పష్టంచేశారు. రదర్శనలు, ధర్నాలు, బైఠాయింపులను పూర్తిగా నిషేధించినట్లు పేర్కొన్నారు.