ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా లహోర్ గడాఫీ స్టేడియం వేదికగా శనివారం జరిగిన మ్యాచ్ -4లో ఇంగ్లండ్ పై ఆస్ట్రేలియా విజయం సాధించింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 351 పరుగులు చేసింది. 95 బంతుల్లోనే సెంచరీ చేశాడు. వన్డే కెరియర్ లో తనకు ఇది మూడో సెంచరీ. ఓవరాల్‌గా 143 బంతులు ఎదుర్కొన్న డకెట్ 165 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్ లో 17 ఫోర్లు, 3 సిక్స్‌లు ఉన్నాయి. జో రూట్( 68) రాణించగా కెప్టెన్ జోస్ బట్లర్(23), జోఫ్రా ఆర్చర్(21) నిరాశపరిచారు. ఫిల్ సాల్ట్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్సే విఫలమయ్యారు.
ఆస్ట్రేలియా బౌలర్లలో బెన్ ద్వార్షుయిస్ మూడు వికెట్లు తీయగా లబుషేన్, జంపా తలా రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక స్కోర్ చేసిన బ్యాటర్ గా డకెట్ రికార్డులకెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు న్యూజిలాండ్ ప్లేయర్ నాథన్ ఆస్టిల్(145) పేరిట ఉంది.
లక్ష్యఛేదనలో భాగంగా మాథ్యూ షార్ట్(66 బంతుల్లో 63), ట్రావిస్ హెడ్(6 ), స్టీవ్ స్మిత్ (5), లబుషేన్ 45 బంతుల్లో 47 పరుగులు చేశారు. అలెక్స్ కేరీ 63 బంతులు ఎదుర్కొని 69 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. దీంతో 282 పరుగుల వద్ద ఆసీస్ ఐదో వికెట్ నష్టపోయింది. జోస్ ఇంగ్లిస్ ఐదో స్థానంలో బ్యాటింగ్ కు దిగి 77 బంతుల్లో 104 పరుగులు చేశాడు. జోస్ ఇంగ్లిస్ 86 బంతుల్లో 120 పరుగులు చేసి నాటౌట్ నిలవగా,
గ్లెన్ మాక్స్‌వెల్ 15 బంతుల్లో 32 పరుగులు రాబట్టి అజేయంగా నిలిచాడు. ఇద్దరు కలిసి లక్ష్యాన్ని ఛేదించారు. దీంతో ఇంగ్లండ్ పై ఆసీస్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది .
ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్, జోఫ్రా ఆర్చర్, బ్రైడన్ కార్సే, అదిల్ రషీద్, లియామ్ లివింగ్ స్టోన్ తలా ఒక వికెట్ తీశారు.