మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజున శ్రీభ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామికి మయూర వాహనసేవ నిర్వహించారు.
జ్యోతిర్లింగ క్షేత్రం, శక్తిపీఠమైన శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో నాల్గవరోజైన శనివారం సాయంత్రం శ్రీస్వామి అమ్మవార్లకు మయూరవాహనసేవ నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అనుగ్రహం పొందారు. మయూర వాహనసేవలో పాల్గొంటే శత్రుబాధలు తొలుకుతాయని పురాణాల్లో పాల్గొన్నారు.
శ్రీ పరమేశ్వరస్వామి చిన్నకుమారుడైన సుబ్రమణ్యస్వామికి మయూరవాహనం చాలా ప్రియమైనది. పక్షి జాతిలో నెమలి చాలా శ్రేష్ఠమైనది. అత్యంత వేగంగా ప్రయాణించగలడం దీని ప్రత్యేకం.
కుమారస్వామి దివ్వవాహనమైన మయూరంపై నుంచి ఆదిదంపతులను దర్శిస్తే పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. నెమలిని చూస్తూ సర్పాలు పారిపోతాయి. అలాగే శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా నెమలి పించాన్ని ఎల్లప్పుడూ ధరించే ఉంటారు.