పాకిస్తాన్ లోని కరాచీ మాలిర్ జైలు నుంచి 22 మంది భారతీయ జాలర్లు విడుదలయ్యారు. వారంతా నేడు వాఘా సరిహద్దు వద్ద భారత్ లో అడుగుపెట్టనున్నారు. ఈ విషయాన్ని మాలిర్ జైలు సూపరింటెండెంట్ అర్షద్ షా మీడియాకు వెల్లడించారు.
జాలర్లు లాహోర్‌కు చేరుకునేందుకు ఆర్థిక సాయం చేసిన ఈదీ ఫౌండేషన్ అధ్యక్షుడు ఫైసల్ ఈదీ వారికి పలు కానుకలు కూడా అందజేయనున్నారు. జాలర్లు సుదీరమైన జైలు శిక్ష అనుభవించారని, దురుద్దేశం లేకుండా పాకిస్తాన్ జలాల్లోకి ప్రవేశించిన వారి విషయంలో దయతో వ్యవహరించాలని కోరారు.
జాలర్లను వాఘా సరిహద్దుకు తీసుకువచ్చి వారిని భారత అధికారులకు అప్పగించే ప్రక్రియను పూర్తి పాకిస్తాన్ అధికారులు పూర్తిచేశారు.