మారిషష్ జాతీయ దినోత్సవానికి ప్రధాన అతిథిగా భారత ప్రధాని
ప్రధాని నరేంద్రమోదీ మార్చిలో విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. మారిషన్ 57వ జాతీయ దినోత్సవానికి ప్రధాని మోదీ, గౌరవ అతిథిగా వెళ్ళనున్నారు. మార్చి 11 నుంచి 12 వరకు ఆ దేశ జాతీయ దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. మారిషన్ ప్రధాని రామ్‌గూలమ్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలకు ఈ వేడుక వేదిక నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రపంచంలోని మేటి నేతల్లో ఒకరైన మోదీ…తీరికలేకుండా ఉన్నప్పటికీ తమ ఆహ్వానాన్ని అంగీకరించడం గౌరవంగా భావిస్తున్నామన్నారు. బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందిన మారిషస్‌కు 1968 మార్చి 12న స్వాతంత్ర్యం లభించింది. దీంతో ప్రతిఏటా మార్చి 12న జాతీయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటోంది.
గతేడాది భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మారిషన్ జాతీయ దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యూనివర్సిటీ ఆఫ్ మారిషష్ ఆమెకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ప్రధాని మోదీ ఈ ఏడాదిలో ఇప్పటికే ఫ్రాన్స్ , అమెరికాలో పర్యటించారు.