శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ సొరంగం పనుల్లో ప్రమాదం చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం ఏడుగంటలకు సొరంగం పనులు చేపట్టేందుకు 40 మంది కార్మికులు లోపలికి వెళ్లారు. 14వ కి.మీ వద్ద పనులు జరుగుతున్నాయి. కార్మికులు పని ప్రారంభించిన కాసేపటికే సొరంగం మూడు మీటర్లమీర కూలిపోయింది. ఏడుగురు కార్మికులు గాయపడ్డారు. మరో ఏడుగురు మట్టదిబ్బల కింద చిక్కుకుపోయారని కూలీలు చెబుతున్నారు.
ప్రమాదం విషయం తెలియగానే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఘటనా స్థలానికి బయలుదేరారు. గాయపడిన వారికి సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సొరంగంలో కరెంటు సరఫరా కూడా లేకపోవడంతో టార్చ్ వెలుగుల్లో కార్మికులు బయటకు చేరుకున్నారు.ప్రమాద కారణాలను విశ్లేషించాల్సి ఉంది. ఈ ప్రమాదంలో ఓ ఇంజనీరు కూడా గాయపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరవాత శ్రీశైలం ఎడమ సొరంగం పనులు నాలుగు రోజుల కిందటే ప్రారంభం అయ్యారు. జేపీ వెంచర్స్ ఈ పనులు నిర్వహిస్తోంది. శ్రీశైలం ఎడమ సొరంగం ద్వారా నల్గొండ జిల్లాలోని కరవు ప్రాంతాలకు సాగు, తాగునీరందించేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టారు.