గ్రూప్ టు మెయిన్స్ పరీక్షలు వాయిదా అంటూ జరుగుతోన్న తప్పుడు ప్రచారాన్ని ఏపీపీఎస్సీ కొట్టిపారేసింది. ఆదివారం జరగాల్సిన గ్రూప్ టు మెయిన్స్ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు మొదటి పేపర్, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు రెండవ పేపర్ మెయిన్స్ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని కమిషన్ ప్రకటించింది. పరీక్షలు వాయిదా అంటూ సోషల్ మీడియాలో వస్తోన్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని కమిషన్ ప్రకటన విడుదల చేసింది.
పరీక్షలు వాయిదా అంటూ సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తోన్న వారిపై కేసులు నమోదు చేయాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది. ఫేస్ బుక్, ఇన్స్టా, వాట్సప్ గ్రూపుల ద్వారా కొందరు కావాలనే తప్పుడు ప్రచారం ప్రారంభించారని ఏపీపీఎస్సీ అనుమానిస్తోంది.అలాంటి వారిపై పోలీసు కేసులకు కమిషన్ సిద్దమైంది.