మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైల క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. స్వామి అమ్మవార్లు హంస వాహనంపై మూడో రోజు శుక్రవారం దర్శనమిచ్చారుశివమాలధారులకు తోడు సామాన్యభక్తులు పెద్తఎత్తున జ్యోతిర్లింగ క్షేత్రానికి నల్లమలగిరులు శివనామ స్మరణతో మార్మోగుతున్నాయి.
బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన నాటి నుంచి శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల సమయానికి 47,477 మంది భక్తులు భ్రమరాంబ మల్లికార్జునస్వామి అనుగ్రహంపొందారు. సుమారు 18,500 మంది పాదయాత్రగా క్షేత్రానికి తరలివచ్చారు.
నేడు ఆదిదంపతులకు కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయం నుంచి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈవో దంపతులు, వినాయకస్వామి తరఫున ఈ వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీశైల ఈవో దంపతులు పాల్గొన్నారు. ఈ రోజు సాయంత్రం తిరుమల వేంకటేశ్వరస్వామి తరఫున టీటీడీ ఈవో, శ్రీ స్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగోవ రోజు రాత్రి స్వామి అమ్మవార్లు మయూర వాహనంపై నుంచి భక్తులను కటాక్షించనున్నారు.