ఐటీ నగరం బెంగళూరులో దారణం వెలుగు చూసింది. ఓ మహిళను నమ్మించి హోటల్‌కు తీసుకెళ్లి నలుగురు కీచకులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటన కోరమంగళ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
ఢిల్లీకి చెందిన ఓ కుటుంబం బెంగళూరులో స్థిరపడింది. భర్త సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తోండగా భార్య క్యాటరింగ్ సర్వీసెస్‌లో పనిచేస్తోంది. బస్ స్టాప్ వద్ద ఉండగా నలుగురు యువకులు మాటలు కలిపి డిన్నర్‌కు హోటల్‌కు ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఓ హోటల్ బాల్కనీకి తీసుకెళ్లి నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె ఇంటికి చేరుకుని భర్తకు విషయం చెప్పడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారంతా హోటళ్లలో చెఫ్‌లుగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. వీరంతా ముందస్తు ప్రణాళిక ప్రకారం చేశారా? లేదంటే అనుకోకుండా నలుగురూ అత్యాచారం చేశారా? అనే విషయంలో దర్యాప్తు జరుగుతోంది. బాధితురాలికి ముందస్తు పరిచయం లేకుండా డిన్నర్‌కు పిలవగానే ఎందుకు వెళ్లిందనే అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు.