ఢిల్లీ హైకోర్టు ఓ కేసు విషయంలో జారీ చేసిన ఆదేశాలను పరిశీలించిన సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టిన ఘటన దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. వివరాల్లోకి వెళితే.
ఢిల్లీ హైకోర్టుకు బెయిల్ కోసం ఆధార్ ఖరా అనే డాక్టర్లు పిటిషన్ వేసుకున్నారు. దీనిపై విచారించిన హైకోర్టు పిటిషన్ తిరస్కరిస్తూ 40 పేజీల ఆదేశాలు జారీ చేసింది. దీనిపై నిందితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసు పరిశీలించిన సుప్రీంకోర్టు ధర్మాసనంలోని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్ చీవాట్లు పెట్టారు. చీటింగ్ కేసులో ఆధార్ ఖేరా అనే డాక్టరు దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. ముందుగా ఖేరా ముందస్తు బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ జరిపిన కోర్టు పిటిషన్ తిరస్కరించింది.
పిటిషన్ తిరస్కరిస్తూ 40 పేజీల ఆదేశాలు ఇచ్చారు. దీనిపై ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు ఆదేశాలు పరిశీలించిన సర్వోన్నత న్యాయస్థానం ఢిల్లీ కోర్టు ఆదేశాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నేర నిరూపణ ఖరారు చేయడానికి అవసరమైన కారణాలు చూపుతూ కింది కోర్టుకు ఉప్పందించినట్టుగా హైకోర్టు ఆదేశాలు ఉన్నాయంటూ సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది.