భారత సంతతికి చెందిన కాష్ పటేల్ అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సంస్థ డైరెక్టర్‌గా ప్రమాణ స్వీకారం చేసింది. ట్రంప్ ప్రభుత్వం ఏర్పడిన తరవాత పలువురు భారతీయ మూలాలున్న వారికి పెద్దపీట వేశారు. శుక్రవారం నాడు వాషింగ్టన్ డీసీలో జరిగిన కార్యక్రమంలో అటార్నీ జనరల్ కామ్ బోండీ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. స్నేహితురాలు విల్‌కిన్స్ భగవద్గీత పట్టుకోగా దానిపై చేయి పెట్టి భారత సంతతికి చెందిన కాష్ పటేల్ ప్రమాణం చేశారు.
కాష్ పటేల్ మూలాలు గుజరాత్‌లో ఉన్నాయి. ఆయన తల్లిదండ్రులు తూర్పు ఆఫ్రికాకు వలస వెళ్లారు. ఉగాండాలో కొన్నాళ్లు వ్యాపారం చేశారు. గఢాఫీ అరాచకాలు భరించలేక అమెరికాకు వలస వెళ్లారు. 1980లో కాష్ పటేల్ అమెరికాలో జన్మించారు. బ్రిటన్‌లో న్యాయవిద్య అభ్యసించారు. ఉద్యోగ ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. దీంతో మియామీ కోర్టులో డిఫెండరుగా ప్రాక్టీస్ ప్రారంభించారు. ఆ తరవాత ప్రతినిధుల సభలో కమిటీ ఆఫ్ ఇంటెలిజెన్స్‌లో నియమించారు. 2016 ఎన్నికల్లో రష్యా జోక్యంపై విచారణ జరిపారు. ఆ సమయంలోనే ట్రంప్ దృష్టిలో పడ్డారు.