ఉత్తరప్రదేశ్‌లో హాథ్రస్ తొక్కిసలాట కేసు విచారణలో భోలేబాబాకు క్లీన్ చిట్ లభించినట్లు వార్తలు వస్తున్నాయి. హాథ్రస్ తొక్కిసలాట ఘటనపై విచారణ జరిపేందుకు యూపీ ప్రభుత్వం హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యులతో జుడీషియల్ కమిషన్ నియమించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై విచారణ జరిపిన కమిషన్, తొక్కిసలాటలో భోలేబాబా పాత్ర లేదని తేల్చింది.
గత ఏడాది హాథ్రాస్ జిల్లా పుల్‌రయీ, మొగల్‌గఢీ మధ్య రహదారికి ఆనుకుని తాత్కాలిక టెంట్లు వేసి సత్సంగ్ నిర్వహించారు. ముందుగా 80 వేల మంది బాబా భక్తులు వస్తారని అంచనా వేశారు. అయితే అనూహ్యంగా 2.3 లక్షల మంది భక్తులు రావడం, బాబా ప్రసంగం తరవాత ఆయన పాదదూళి కోసం జనం ఎగబడటంతో జరిగిన తొక్కిసలాటలో 121 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీనిపై యూపీ ప్రభుత్వం జుడీషియల్ కమిషన్ వేసింది. విచారణ పూర్తి చేసిన కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నివేదికను త్వరలో అసెంబ్లీకి సమర్పించనున్నారు.