బంగారం దోపిడీ కేసులో నిందితుడిగా ఉన్న సిమ్రత్‌ప్రీత్ పనేసర్‌కు చెందిన పంజాబ్‌లోని మొహాలీ నివాసంలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. గత ఏడాది కెనడాలోని టొరంటో విమానాశ్రయంలో 400 కేజీల బంగారం ఉంచిన కంటెయినర్ మాయం చేసిన కేసులో సిమ్రత్‌ప్రీత్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఎయిర్ కెనడాలో మేనేజర్‌గా పనిచేసిన 32 ఏళ్ల సిమ్రత్‌ప్రీత్, ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్నారు.
టొరంటోకు 2023 ఏప్రిల్‌లో 400 కేజీల బంగారంతో స్విట్జర్లాండ్ నుంచి ఓ విమానం దిగింది. అందులోని బంగారం కలిగిన కంటెయినర్‌ను గోడౌన్లో ఉంచారు. ఆ సమయంలో ఇద్దరు భారతీయులు ఆ కంటెయినర్ ఉంచిన గిడ్డంగులకు ఇంఛార్జిలుగా ఉన్నారు. ఉదయం బంగారాన్ని తరలించాలని చూసిన పోలీసులు ఖంగుతిన్నారు. కంటెయినర్ లోని బంగారం మాయం అయినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
సిమ్రత్‌ప్రీత్ చంఢీగడ్ ప్రాంతంలో నక్కినట్లు అనుమానిస్తున్నారు. కెనడా పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు మొహాలీలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ కేసులో సిమ్రత్‌ప్రీత్ ప్రధాన ముద్దాయిగా ఉన్నాయి. బంగారంతోపాటు దోచుకున్న కొంత సొమ్మును కెనడా పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.