మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు శ్రీశైల క్షేత్రంలో రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజు ఉత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి ఆదిదంపతులు భృంగి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులతో శ్రీగిరులు కిటకికటలాడాయి.
నేడు మూడో రోజు ఉత్సవ సేవల్లో భాగంగా శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామివారు హంస వాహనంపై నుంచి భక్తులను అనుగ్రహించనున్నారు. విజయవాడ శ్రీదుర్గామల్లేశ్వర దేవస్థానం అధికారులు స్వామిఅమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
భక్తుల రద్దీ నేపథ్యంలో బ్రహ్మోత్సవాలు జరిగే 11 రోజుల పాటు ఆర్జిత సేవలు నిలిపివేసి, కేవలం అలంకార దర్శనాలు మాత్రమే కల్పిస్తున్నారు.