త్రివేణి సంగమంలో ఘనంగా నిర్వహించిన మహాకుంభమేళా కాస్తా తొక్కిసలాటలతో మృత్యుకుంభ్గా మారిందని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను మరోసారి సమర్ధించుకుంది. అన్ని మతాలను తాను గౌరవిస్తానని చెబుతూనే తాను చేసిన వ్యాఖ్యలను సమర్ధించుకుంది. మతం అనేది వ్యక్తిగతం అంటూనే, మతపరమైన పండుగలు అందరికోసమని చెప్పుకొచ్చారు.
నేను నా మతాన్ని గౌరవిస్తాను, నా మతాన్ని నేను గౌరవించనని మీకు ఎవరు చెప్పారంటూ ప్రశ్నించారు. మతం వ్యక్తి గతం. పండగలు అందరివీ అంటూ సమర్థించుకునే ప్రయత్నం చేశారు. దేశంలో ప్రతి రాష్ట్రానికి ప్రత్యేకమైన ఆచారం, భాషలుంటాయని ఆమె చెప్పారు.
అన్ని మతాలు, సంస్కృతులు, జీవన విధానాలను గౌరవించాలంటూ మమతా చెప్పుకొచ్చారు. తను ఆడా, మగా అని కొందరు అడుగుతూ ఉంటారని, నేను ఒక మనిషినని, నాకు మానవత్వమే ముఖ్యమని ఆమె చెప్పరు. మనది భిన్నత్వంలో ఏకత్వం అంటూ తాను చేసిన వ్యాఖ్యలను సమర్ధించుకున్నారు.