ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగిన తొలి మ్యాచ్ లో భారత జట్టు శుభారంభం చేసింది. దుబాయ్ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్, బ్యాటింగ్ విభాగంలోనూ భారత్ పై చేయి సాధించింది. ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి టోర్నీలో విజయంతో బోణీ కొట్టింది. ఈ మ్యాచ్ లో మహ్మద్ షమీ ఐదు వికెట్లు తీయగా, యువ ఆటగాడు శుభమన్ గిల్ సెంచరీ చేశాడు.
టాసె నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 228 పరుగుల చేసింది. ఈ లక్ష్యాన్ని భారత జట్టు 46.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ రోహిత్‌శర్మ 41 పరుగులు చేయగా, శుభమన్ గిల్ శతకం కొట్టాడు. 129 బంతుల్లో 101 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.గిల్ తన వన్డే కెరియర్ లో ఎనిమిదోయసెంచరీ నమోదు చేశాడు. విరాట్ కోహ్లీ( 22) శ్రేయాస్ అయ్యర్ (15), అక్షర్ పటేల్( 8) విఫలమైనప్పటికీ కేఎల్ రాహుల్( 41*), గిల్ కలిసి భారత్ ను విజయతీరాలకు చేర్చారు.
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గ్రూప్-బిలో భాగంగా ఆఫ్ఘనిస్తాన్-సౌతాఫ్రికా జట్లు కరాచీ వేదికగా తలపడనున్నాయి. ఫిబ్రవరి 23న భారత్, పాకిస్తాన్ లు దుబాయ్ వేదికగా తలపడనున్నాయి.