ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఆరంభంలో 8.3 బంతులకే 5 వికెట్లు నష్టపోయిన బంగ్లాదేశ్ ఆ తర్వాత కుదురుకుంది. జకీర్ అలీ, తౌహీద్ హృదయ్ ఆ తర్వాత క్రీజులో పాతుకుపోయారు.
ఓ వైపు వికెట్లు పడుతున్న వెరవకుండా ఐదో స్థానంలో బ్యాటింగ్ కు దిగిన తౌహీద్ హృదయ్ సెంచరీ కొట్టాడు. 114 బంతులు ఎదుర్కొని శతకం కొట్టాడు.
ఏడో స్థానంలో బ్యాటింగ్ కు దిగిన జకీర్ అలీ, 68 పరుగులు చేసి ఆరో వికెట్ గా షమీ బౌలింగ్ లో వెనుదిరిగాడు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ లో సౌమ్యా సర్కార్, నజ్ముల్ హుస్సేన్, ముష్ఫికర్ రహీమ్, తాంజీద్ హుస్సేన్ డకౌట్ అయ్యారు. తంజీద్ హసన్(25), మెహిదీ హసన్ (5) ను షమీ ఔట్ చేయగా రిషాద్ హుస్సేన్ ( 18) హర్షిత్ రాణా వెనక్కిపంపాడు. పదో స్థానంలో బ్యాటింగ్ కు దిగిన తస్కిన్ అహ్మద్ (3) ను షమీ 9 వికెట్ గా పెవిలియన్ కు పంపాడు. సెంచరీ హీరో తౌహిద్ హృదయ్ వెనుదిరగడంతో బంగ్లా ఇన్నింగ్స్ 228 పరుగులు వద్ద ముగిసింది. 49.4 ఓవర్లలో బంగ్లాదేశ్ 228 పరుగులు చేసి భారత్ ముందు 229 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు.
భారత బౌలర్లలో మహమద్ షమీ ఐదు వికెట్లు తీయగా, హర్షిత్ రాణా మూడు, అక్షర్ పటేల్ రెండు వికెట్లు తీశారు.