మూడు దశాబ్దాల కిందట చేసిన తప్పుడు పనికి నేడు శిక్ష ఖరారైంది. 30 సంవత్సరాల కిందట తప్పుడు పత్రాలతో ప్రభుత్వం నుంచి ఫ్లాట్ తీసుకున్న కేసులో మహారాష్ట్ర మాజీ వ్యవసాయశాఖ మంత్రి మాణిక్‌రావు కొకరేకు నాసిక్ కోర్టు రెండేళ్లు జైలు శిక్ష విధించింది. మంత్రితోపాటు అతని సోదరుడికి జైలు శిక్షతోపాటు రూ.50 వేల జరిమానా కూడా విధిస్తూ న్యాయమూర్తి శిక్ష ఖరారు చేశారు.
నకిలీ పత్రాలు సమర్పించి ప్రభుత్వ కోటాలో ఫ్లాట్లు పొందారని మాజీ మంత్రి టీఎస్ డిషూలే 1995లో కేసు వేశారు. మొత్తం ఈ కేసులో 10 మంది సాక్షులను కోర్టు విచారించింది. కొకరే సోదరులను ఇద్దరినీ దోషులుగా కోర్టు తేల్చింది. మూడు దశాబ్దాల తరవాత వారికి శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.
తనకు బెయిల్ వచ్చిందని అప్పీల్‌కు వెళుతున్నట్లు మాజీ మంత్రి కొకరే తెలిపారు. తనకు సొంత ఇళ్లు లేదని అందుకే నకిలీ పత్రాలు ఇచ్చి ఫ్లాటు పొందినట్లు మంత్రి మీడియాకు తెలిపారు. ఈ కేసులో మొత్తం 10 మంది సాక్షులను విచారించినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెల్లడించారు. అయితే వీరిపై కేసు పెట్టిన మాజీ మంత్రి ఢిషూలే మాత్రం కాలం చేశారు.