తిరుమల శ్రీవారి ఆలయం పైనుంచి విమానం వెళ్ళడం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆగమశాస్త్ర నిబంధనల ప్రకారం శ్రీవారి ఆలయంపై ఎలాంటి రాకపోకలు సాగించకూడదు. కానీ గురువారం ఈ ఘటన జరగడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఈ తరహా ఘటనలు జరిగగా దీనిపై టీటీడీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ విమానయాన శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్ళారు.
తిరుమల గోపురంపై నుంచి విమానాల రాకపోకలపై ఆలయ అధికారులు ఇప్పటికే పలుసార్లు కేంద్రవిమానాయన శాఖకు విజ్ఞప్తి చేసింది. తిరుమల శ్రీవారి ఆలయం సమీపం నుంచి తిరుమల గగనతలంలోని ఇతర ప్రదేశాల నుంచి విమానాల రాకపోకలు సాగించాలన్న టీటీడీ విన్నవించింది.
గురువారం జరిగిన ఘటనపై స్పందించిన హోంమంత్రి అనిత , శ్రీవారి ఆలయంపై విమానం చక్కర్లు కొట్టిన ఘటనపై దర్యాప్తుకు ఆదేశించామన్నారు. నివేదికలు వచ్చిన వెంటనే కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం చర్చించనున్నట్లు వివరించారు.