గుంటూరు సర్వజన ఆసుపత్రి (GGH)లో గులియన్ భారీ సిండ్రోమ్ (GBS) లక్షణాలతో ఓ మహిళ చనిపోయింది. ఈ నెల 2న ఆస్పత్రిలో చేరిన షేక్ గౌహర్ జాన్ అనే మహిళ బుధవారం చికిత్స పొందుతూ ప్రాణాలు విడించింది. ఆసుపత్రిలో జీబీఎస్ సంబంధిత మరణం రెండవదని వైద్యులు తెలిపారు. ప్రకాశం జిల్లాకు చెందిన కమలమ్మ కూడా ఇదే ఆసుపత్రిలో జీబీఎస్ లక్షణాలకు చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది.
గుంటూరు జీజీహెచ్‌లో మరికొందరు జీబీఎస్ రోగులు కూడా చికిత్స తీసుకుంటున్నారు. జీబీఎస్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రులు, అధికారులు చెబుతున్నప్పటికీ ఇప్పటికే ఇద్దరు చనిపోవడంపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
వ్యాధి లక్షణాలు…
మెదడు నుంచి కాళ్ల వరకు పొడవుగా ఉండే కాలి నరాలు ప్రభావితమై కాళ్లు చచ్చుబడిపోవడంతో పాటు క్రమంగా వీపు భాగం, చేతులు, మెడ కండరాలు అచేతనంగా మారతాయి. ఆహారం మింగడం, మాట్లాడటం కూడా కష్టంగానే ఉంటుంది. గుండె స్పందనల్లో మార్పులు, బీపీ హెచ్చు తగ్గులు, ముఖం నుంచి వేడి ఆవిర్లు, అతిగా చెమటలు పట్టడం కూడా కనిపిస్తాయి.
వ్యాధి సోకిన తర్వాత 7 నుంచి 14 రోజుల్లో తీవ్రమవుతోంది. మైలీన్ పొర మళ్లీ యథాస్థితికి వస్తేనే బాధితుడు కొలుకుంటాడు. ఇందుకు రోజుల వ్యవధి నుంచి ఆరు నెలలు వరకు పట్టవచ్చు.