గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టులో వల్లభనేని వంశీ పెట్టుకున్న పిటిషన్‌ను న్యాయమూర్తి కొట్టివేశారు. దళిత యువకుడు సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీ అరెస్టైన సంగతి తెలిసిందే. ఈ కేసుతో తనకు సంబంధం లేదని ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ వంశీ హైకోర్టును ఆశ్రయించారు. వంశీ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.
వల్లభనేని వంశీ తరపు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్ కొట్టేసిన హైకోర్టు, విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టును ఆశ్రయించాలని సూచించింది. ఇప్పటికే గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన కేసులో 32 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారంతా బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేయగా న్యాయమూర్తి గతంలోనే కొట్టివేశారు. తాజాగా వల్లభనేని వంశీ పిటిషన్ కూడా కొట్టివేశారు.
గన్నవరం టీడీపీ కార్యాలయంలో పనిచేసే సత్యవర్థన్‌ను బెదిరించి, కేసు ఉపసంహరించుకుంటే రూ.25 లక్షలు ఇస్తామంటూ పక్కదారి పట్టించే ప్రయత్నం చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వంశీని విచారించేందుకు తమకు పది రోజుల కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు విజయవాడ కోర్టును ఆశ్రయించారు.దీనిపై ఇవాళ తీర్పురానుంది.