మహా కుంభమేళాలో మహిళలు పుణ్య స్నానాలు చేసిన వీడియోలు కొందరు అరాచకవాదులు సోషల్ మీడియాలో విక్రయానికి పెట్టారు. ఈ విషయాన్ని గ్రహించిన యూపీ పోలీసులు కొత్వాల్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. కొందరు దుర్మార్గులు మహిళలు పుణ్యస్నానాలు చేస్తున్న వీడియోలను ఇన్స్టాలో అప్ లోడ్ చేశారు. మహిళల గోపత్యకు భంగం కలిగించారనే సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. టెలిగ్రామ్లోనూ వీడియోలు విక్రయానికి పెట్టారు. ఈ కేసును పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు.
ఫేసుబుక్లో వీడియోలు ఆప్లోడ్ చేసిన వారి వివరాలు అందించాలని మెటా సంస్థకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మహాకుంభ మేళాపై అసత్య ప్రచారం చేసినా శిక్షలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ప్రయాగ్రాజ్ వద్ద త్రివేణి సంగంలో నీరు చాలా కలుషితం అయ్యాయని స్నానం చేయడానికి పనికిరావంటూ కొందరు చేసిన వ్యాఖ్యలపై యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ దాస్ స్పందించారు. త్రివేణి సంగమం వద్ద నీరు తాగడానికి పనికివచ్చేంత స్వచ్ఛంగా ఉన్నాయని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో మహాకుంభమేళా గురించి తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు.
ఇప్పటి వరకు మహాకుంభమేళాలో 58 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారు. జనవరి 12న మొదలైన మహాకుంభమేళా ఫిబ్రవరి 26 వరకు జరగనుంది. కుంభమేళా ముగిసేనాటికి పుణ్యస్నానాలు చేసే వారి సంఖ్య 60 కోట్లు దాటుతుందని అంచనా. ఇప్పటికీ అనేక ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తుతున్నారు. కుంభమేళా మరికొన్ని రోజులు పొడిగించాలనే డిమాండ్లు వస్తున్నాయి.