ఛాంపియన్స్ ట్రోఫి-2025 తొలి మ్యాచ్ లోనే పాకిస్తాన్ కు పరాభవం ఎదురైంది. చాలా కాలం తర్వాత ఐసీసీ ఈవెంట్ కు ఆతిథ్యమిస్తోన్న పాకిస్తాన్, బుధవారం న్యూజీలాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఓడింది. న్యూజీలాండ్ ఆటగాళ్ళు లేథమ్, విల్ యంగ్ అదిరే శతకాలతో కివీస్ విజయంలో కీలకపాత్ర పోషించారు.
ఛాంపియన్స్ ట్రోఫీలో టైటిల్ వేటలో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజీలాండ్ ఘనంగా ఆరంభించింది. మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. కివీస్ 60 పరుగుల తేడాతో ఆతిథ్య పాకిస్తాన్ ను ఓడించింది.
లేథమ్ 104 బంతుల్లో 118 పరుగులు చేయగా విల్ యంగ్ 113 బంతుల్లో 107 పరుగులు చేయగా గ్లెన్ ఫిలిప్స్ 39 బంతుల్లో 61 పరుగులు రాబట్టాడు. రు. కివీస్ 5 వికెట్లు నష్టపోయి 320 పరుగులు చేసింది.
ఛేదనలో పాక్ విఫలమైంది. న్యూజీలాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో 47.2 ఓవర్లలో 260 పరుగులకే ఆలౌటైంది. కుష్‌దిల్ షా (69)టాప్ స్కోరర్ గా నిలవగా బాబర్ అజామ్ (64) అర్ధశతకం చేశాడు. షకీల్ (6), రిజ్వాన్ (3) నిరాశపరిచారు. బాబర్ అజామ్, ఫకార్ జమాన్ బ్యాటింగ్ తో ఆకట్టుకోలేకపోయారు.