అనేక తర్జనభర్జనల తరవాత కేంద్ర బీజేపీ పెద్దలు ఢిల్లీ సీఎం అభ్యర్థిని ప్రకటించారు. ప్రస్తుతం 14 రాష్ట్రాల్లో అధికారం ఉన్నా మహిళా ముఖ్యమంత్రి లేరనే అపవాదును తొలగించుకునే ప్రయత్నం చేశారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఓబీసీ మహిళ రేఖా గుప్తా పేరును సీఎం అభ్యర్థిగా తెరమీదకు తెచ్చారు.
ఢిల్లీలోని శాలీమార్‌భాగ్ నుంచి రేఖా గుప్తా, ఆప్ అభ్యర్థి వందనకుమారిపై 29వేలకుపైగా మెజారిటీతో గెలిచారు. 1974 జులై 19న జన్మించిన రేఖాగుప్తా ఢిల్లీలోనే విద్యాభ్యాసం పూర్తి చేశారు. చదువుకునే రోజుల్లోనే ఏబీవీపీలో పనిచేసి గుర్తింపు పొందారు. బీజేపీ, అనుబంధ విభాగాలతో ఆమెకు 30 సంవత్సరాల అనుబంధం ఉంది.
రేఖాగుప్తా పేరును బీజేపీ అధిష్టానం ఫైనల్ చేసింది. బుధవారం రాత్రి బీజేపీ ఎమ్మెల్యేలు రవిశంకరప్రసాద్ నేతృత్వంలో రేఖాగుప్తాను బీజేపీ పక్ష నేతగా ఎన్నుకున్నారు. అనంతరం ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ ఎల్జీ సక్సేనాతో బుధవారంనాడు రేఖాగుప్తా భేటీ అయ్యారు. ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. గవర్నర్ ఆహ్వానం మేరకు ఇవాళ సాయంత్రం కట్టుదిట్టమైన భద్రత మధ్య పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇవాళ సాయంత్రం జరిగే సీఎం ప్రమాణ స్వీకారానికి ఎన్డీయే నేతలు, ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజరుకానున్నారు.
నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా : భూమన కరుణాకర్‌రెడ్డి