అయోధ్య బాలరాముడి దర్శనానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళా కు వెళ్ళిన వారంతా అటునుంచి అయోధ్య వెళుతున్నారు. దీంతో శ్రీరాముడి జన్మభూమి భక్తులతో కిటకిటలాడుతోంది. రోజూ లక్షల్లో భక్తులు అయోధ్యకు తరలి వస్తున్నారు. భక్తుల తాకిడి పెరగడంతో రామమందిరం నిర్మాణ పనులు నిలిపివేసినట్లు నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు.
కుంభమేళా కారణంగా గడిచిన 25 రోజులుగా నిర్మాణ పనులు నిలిచిపోయినట్లు చెప్పారు. మార్చి లో పూర్తి కావాల్సిన పనులు జూన్ నాటికి పూర్తి అవుతాయని వెల్లడించారు.ప్రతీరోజూ రెండు లక్షల మందికి పైగా భక్తులు రామ్‌లల్లా దర్శనం చేసుకుంటున్నారు. భక్తుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ కొన్ని పనులు నిలిపివేయాల్సి వచ్చిందని వివరించారు.