మహా కుంభమేళా తేదీలను పొడిగించడం లేదని ప్రయాగ్ రాజ్ జిల్లా మెజిస్ట్రేట్ రవీందర మందిర్ తెలిపారు. ఇప్పటికే 55 కోట్ల మంది త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేశారు. ఫిబ్రవరి 26న మహాశివరాత్రితో కుంభమేళా ముగియనుంది. పెద్ద సంఖ్యలో ప్రయాగ్ రాజ్ కు భక్తులు పోటెత్తడతో తేదీలు పొడిగిస్తున్నట్లు ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన ప్రయాగర్ రాజ్ జిల్లా మెజిస్ట్రేట్, మహాకుంభమేళా మతపరమైన, మంగళకరమైన ముహూర్తం ఆధారంగా నిర్ణయమైందని గుర్తు చేశారు. అందులో మార్పులు చేర్పులు ఉండవని స్పష్టం చేశారు.
సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు భక్తలకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. మేళా పొడిగింపు గురించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ జిల్లా యాజమాన్యం నుంచి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదన్నారు. తప్పుడు సమాచారం పట్ల భక్తులు ఆకర్షితులు కావొద్దు అని మెజిస్ట్రేట్ కోరారు. కుంభమేళా సందర్భంగా విద్యార్థులు బోర్డు పరీక్షలు మిస్ అయ్యారనే ప్రచారం కూడా సరికాదన్నారు.