శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. వేదపండితులు యాగశాల ప్రవేశం చేసి ఈ ఉత్సవాలను ఆరంభించారు. రాత్రి 7 గంటలకు ఆలయ ప్రధాన ధ్వజస్తంభంపై ధ్వజపటాన్ని ఆవిష్కరించనున్నారు. నేటి నుంచి మార్చి 1 వరకు బ్రహ్మోత్సవాలు రంగరంగ వైభవంగా జరగనున్నాయి.
మహాశివరాత్రి జాతర సందర్భంగా క్షేత్రం విద్యుత్ దీపాల కాంతులతో మెరిసిపోతోంది.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేటి రాత్రికి ధ్వజపటాన్ని ఆవిష్కరించనున్నారు. ఫిబ్రవరి 20న ఆది దంపతులకు భృంగి వాహన సేవ నిర్వహించనున్నారు. 21న హంస వాహన సేవ, 22న మయూర వాహన సేవ లు నిర్వహించనున్నారు. రావణ వాహనసేవ 23న జరపునున్నారు. ఈ రోజే రాష్ట్రప్రభుత్వం తరఫున ఆదిదంపతులకు సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
పుష్ప పల్లకి సేవ 24న చేపట్టనున్నారు. ఫిబ్రవరి 25న గజవాహనం, 26న నంది వాహనంపై నుంచి స్వామి అమ్మవార్లు భక్తులను అనుగ్రహిస్తారు. ఫిబ్రవరి 27న రథోత్సవం, తెప్పోత్సవం రంగరంగా వైభంగా జరుపుతారు. 28న యాగ పూర్ణాహుతి , మార్చి 1న అశ్వవాహన సేవ ఉంటుంది.
ఉత్సవాల సందర్భంగా 35లక్షల లడ్డూ ప్రసాదానాన్ని భక్తులకు అందుబాటులో ఉంచారు. ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు ఉచితంగా లడ్డూ ప్రసాదం అందించనున్నారు. క్షేత్ర పరిధిలో ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.