మహిళలను క్యాన్సర్ భారీ నుంచి రక్షించేందుకు ఐదారు నెలల్లో టీకా రాబోతుందని కేంద్రమంత్రి ప్రతాప్ రావ్ జాదవ్ తెలిపారు 9 నుంచి 16 ఏళ్ల లోపు వయసు ఉన్న బాలికలకు ఈ వ్యాక్సిన్ వేయనున్నారు. ప్రస్తుతం ట్రయల్స్ దశలో వ్యాక్సిన్ ఉందని వివరించారు. ఛత్రపతి శంభాజీనగర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ విషయాలు వెల్లడించారు.
దేశంలో క్యాన్సర్ రోగుల సంఖ్య పెరుగుతోండటంపై ఆందోళన వ్యక్తం చేసిన కేంద్రమంత్రి ప్రతాప్ జాదవ్ 30 ఏళ్లు పైబడిన మహిళలకు ఆసుపత్రులలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వ్యాధిని ముందస్తుగా గుర్తించేందుకు డేకేర్ క్యాన్సర్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.
క్యాన్సర్ చికిత్సకు వినియోగించే ఔషధాలపై కస్టమ్స్ సుంకాన్ని ఎన్డీయే ప్రభుత్వం రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రొమ్ము, నోటి, గర్భాశయ క్యాన్సర్లను నియంత్రించే వ్యాక్సిన్ ప్రస్తుతం అభివృద్ధి చేసినట్లు తెలిపారు.