ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో వివిధ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది
ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఎంసీఏ (రెండేళ్ల కోర్సు) మొదటి, మూడో సెమిస్టర్ మెయిన్, సెమిస్టర్ లో బ్యాక్లాగ్, బీఎస్ – ఎంఎస్ (కంప్యూటర్ సైన్స్ – ఐదేళ్ల డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రాం) మొదటి, మూడు, అయిదు, ఐదో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలను వచ్చే నెల 11 నుంచి నిర్వహించనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్‌సైట్ లో పొందుపరిచారు.
ఉస్మానియా వర్సిటీ పరిధిలోని విదేశీ భాషల డిప్లొమా కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరించనున్నట్లు మరో ప్రకటనలో వివరించారు. ఫ్రెంచ్, జర్మన్ భాషల్లో జూనియర్, సీనియర్ డిప్లమా అభ్యర్థులు పరీక్షా ఫీజును వచ్చే నెల 5 లోగా సంబంధిత కళాశాలలో చెల్లించాలని తెలిపారు. రూ.300 అపరాధ రుసుంతో పదో తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని చెప్పారు. పరీక్షలను ఏప్రిలో నిర్వహించనున్నారు. మరిన్ని వివరాలకు www.osmania.ac.in లో పొందుపరిచారు.