ఆంధ్రప్రదేశ్‌లోని ఆరు యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లను గవర్నర్ నియమించారు. ఆంధ్రా వర్సిటీ వీసీగా జి.పి. రాజశేఖర్ నియమితులయ్యారు. ప్రస్తుతం రాజశేఖర్ ఐఐటి ఖరగ్‌పూర్‌లో గణితశాస్త్ర ప్రొపెసర్‌గా చేస్తున్నారు. కాకినాడ జేఎన్టీయూ వీసీగా సీఎస్‌ఆర్‌కె ప్రసాద్‌ను నియమించారు. ప్రస్తుతం ఈయన వరంగల్ నిట్‌లో ప్రొపెసర్‌గా పనిచేస్తున్నారు.యోగివేమన వర్సిటీకి ప్రకాశ్ బాబును వీసీగా నియమించారు. ఈయన ప్రస్తుతం హెచ్‌సీయూలో ప్రొఫెసర్‌గా ఉన్నారు. వీరు మూడేళ్లపాటు వీసీలుగా కొనసాగనున్నారు.
రాయలసీమ వర్సిటీకి వెంకట బసవరావు, అనంతపురం జేఎన్టీయూకు సుదర్శనరావు, తిరుమల పద్మావతి వర్సిటీకి ఉమ, కృష్ణా వర్సిటీకి ప్రసన్న శ్రీ, విక్రమ సింహపురి వర్సిటీకి అల్లం శ్రీనివాసరావులను నియమిస్తూ గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ విడుదల చేశారు.