ప్రయాగ్రాజ్ కుంభమేళా ముగింపు తేదీ దగ్గర పడుతుండటంతో త్రివేణీ సంగమానికి భక్తులు పోటెత్తారు. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ ఆధ్యాత్మిక సంరంభం మరో ఎనిమిది రోజుల్లో ముగియనుంది. దీంతో దేశం నలుమూలల నుంచి ప్రయాగ్ రాజ్ కు చేరుకుంటున్నారు. గడిచిన 37 రోజుల్లో 53.24 కోట్లకు పైగా భక్తులు మహాకుంభమేళాలో పుణ్య స్నానాలు చేశారు.
సోమవారం నాడు కోటిమంది పుణ్యస్నానాలు చేశారు. సోమవారం రాత్రి మహా కుంభ్ సమీప ప్రాంతాలైన నైని నయా వంతెన, ఫాఫమౌలో 10 నుంచి12 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.మాజీ ఉపరాష్ట్ర పతి వెంకయ్యనాయుడు, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు ప్రయాగ్ రాజ్ లో పవిత్ర స్నానాలుచేయనున్నారు.
మహాకుంభమేళా కోసం ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వంతో పాటు కేంద్రప్రభుత్వం కలిసి రూ. 7,500 కోట్లు ఖర్చు చేశాయి. ఫలితంగా రాష్ట్రానికి మూడు లక్షల కోట్ల ఆదాయం సమకూరనుంది. ఈ విషయాన్ని యూపీ సీఎం యగీ తెలిపారు. మకర సంక్రాంతితో ప్రారంభైన కుంభమేళా శివరాత్రితో ముగియనుంది.