అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి హత్య కేసును పోలీసులు ఛేదించారు. గత వారం సంచలనంగా మారిన ఏసురాజు హత్య కేసు ఎట్టకేలకు సోమవారంనాడు కొలిక్కి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
నిడమర్రు బావాయిపాలెం గ్రామానికి చెందిన మజ్జి ఏసురాజు అదే గ్రామానికి చెందిన ఓ వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆమె భర్త ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో కక్ష కట్టారు. ఇటీవల గణపవరంలో ఏసురాజు, బాధితుడి భార్య గడపడాన్ని గమనించాడు. వెంటనే తండ్రి, మరో స్నేహితుడి సాయంతో ఏసు రాజును బావాయిపాలెం తీసుకువచ్చి కుడి చేయి నరికేశారు. తరవాత కాపవరం పంట కాలువలో పడేశారు. కుడిచేసి నరికేయడంతో ఏసురాజు అపస్మారక స్థితిలోకి జారుకున్నాడు. కాలువలో ఎవరూ గమనించకపోవడంతో రక్తస్రావంతో చనిపోయాడు.
పంట కాలువలో శవాన్ని గుర్తించిన రైతులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ కేసులో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగుచూశాయి. అక్రమ సంబంధం వద్దని వారించినా వినకపోవడంతోనే చేయి నరికేసినట్లు నిందితులు చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు.