1991 ప్రార్థనా స్థలాల చట్టం విషయంలో సుప్రీంకోర్టుకు కుప్పలు తెప్పలుగా వస్తోన్న పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొత్త పిటిషన్లను తీసుకునేది లేదని తేల్చి చెప్పారు. ప్రార్థనా స్థలాలను తిరిగిపొందడం, మార్పులు కోరడాన్ని పిటిషన్లు ఆపేస్తాయని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. జరిగింది ఏదో జరిగిపోయింది ఇకనైనా ముగింపు పలకాలని సూచించారు.
కొత్త పిటిషన్ల దాఖలును వ్యతిరేకించినప్పటికీ, ఇప్పటికే ఉన్న పిటిషన్లలో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు అవకావం కల్పించింది. కూల్చి వేసిన హిందూ దేవాలయాల పునరుద్దరణ విషయంలో 1991 చట్టం ప్రకారం పిటిషన్లు దాఖలు అవుతున్నాయి. 1947లోని చట్టానికి 1991లో వచ్చిన ప్రార్థనా స్థలాల చట్టం వల్ల దేవాలయాల స్థలాల స్వభావాలను మార్చడం సాధ్యం కాదు.
1991 చట్టం చెల్లుబాటును ప్రశ్నిస్తూ అశ్విని కుమార్ బంధోపాద్యాయ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో సుప్రీంకోర్టు 18 పిటిషన్లను నిలిపివేసింది. ఇందులో షాహి ఈద్గా శ్రీ కృష్ణ జన్మభూమి, కాశీ విశ్వనాథ్, సంభాల్ మసీదు వివాదాలు ఉన్నాయి.