అమెరికాలోని ప్రభుత్వ సమర్ధతా విభాగం (డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ) ఆదివారం నాడు ఒక జాబితాను ప్రచురించింది. వివిధ దేశాల్లో పెట్టుబడులు పెట్టే కార్యకలాపాలను ఇటీవల నిలిపివేసిన లేదా రద్దు చేసిన వాటి వివరాలను ఆ జాబితాలో పేర్కొంది. ఆ జాబితాలో పేర్కొన్న ఒక నిధుల కేటాయింపు, భారతదేశానికి చెందినది కావడం గమనార్హం. దాని ప్రకారం, కన్సార్షియం ఫర్ ఎలక్షన్స్ అండ్ పొలిటికల్ ప్రోసెస్ స్ట్రెంతెనిగ్ (CEPPS) అనే సంస్థకు 48.6కోట్ల డాలర్ల నిధులు ఇచ్చారు. అందులో 2.1కోట్ల డాలర్ల మొత్తాన్ని ఓటర్ టర్నవుట్ కోసం ఖర్చు చేయడానికి వినియోగించాలని నిర్దేశించారు. అంటే నేటి కరెన్సీ మారకంలో దాదాపు రూ.182కోట్లు మొత్తాన్ని, ఓటర్లను పోలింగ్‌బూత్‌ల దగ్గరకు వచ్చేలా చేయడానికి ఖర్చు పెట్టాలి.
సిఇపిపిఎస్ అంటే ఏమిటి?
సిఇపిపిఎస్ సంస్థను 1995లో స్థాపించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ఏర్పాటైన లాభాపేక్ష లేని, విభజన స్వభావం లేని, స్వచ్ఛంద సంస్థల కూటమి అది. అందులో ప్రధానంగా… ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఎలక్టోరల్ సిస్టమ్స్, ఇంటర్నేషనల్ రిపబ్లికన్ ఇనిస్టిట్యూట్, నేషనల్ డెమొక్రటిక్ ఇనిస్టిట్యూట్ అనే మూడు సంస్థలున్నాయి. వివిధ దేశాల్లో పనిచేసే సిఇపిపిఎస్‌కు ముసుగు సంస్థలివి.
ప్రజాస్వామ్య అభివృద్ధి కోసం ప్రపంచంలోని పలు దేశాల్లో వివిధ రాజకీయ పక్షాలు, ఎన్నికల నిర్వహణా సంస్థలు, పార్లమెంటులు, పౌర నాగరిక సమూహాలు, ప్రజాస్వామిక కార్యకర్తలతో కలిసి పనిచేస్తామని సిఇపిపిఎస్ ప్రకటించుకుంది. ఆ సంస్థ 140కి పైగా దేశాల్లో క్రియాశీలంగా పనిచేస్తోంది. ప్రజాస్వామ్యం, హక్కులు, పరిపాలన అనే కార్యక్రమం ద్వారా ప్రజలకు చేరువ అవుతూ ఉంటుంది. ఆ సంస్థకు నిధులు సమకూర్చే సంస్థల్లో ముఖ్యమైనది యుఎస్ఎయిడ్. దానివెనుక భారతదేశ పతనానికి పనిచేస్తున్న జార్జి సోరోస్ ఉన్నాడన్న సంగతి తెలిసిందే. సిఇపిపిఎస్ వివిధ దేశాల్లో స్థానిక రాజకీయ పరిస్థితులను బట్టి, అక్కడ ప్రభుత్వాలు తమ అంచనా ప్రకారం ఎలా ఉండాలో అంచనా వేసి, దానికి అనుగుణంగా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూంటుంది.
ఈ సిఇపిపిఎస్‌కు ప్రధానంగా నిధులు సమకూర్చినది యుఎస్ఎయిడ్. ఆ సంస్థ ప్రపంచమంతటా తన ప్రణాళికలను అమలు చేయడానికి దానికి ప్రపంచం నలుమూలల నుంచీ అనేకమంది విరాళాలు ఇస్తుంటారు. సిఇపిపిఎస్ ఆవిర్భావం నుంచి నేటివరకూ దానికి యుఎస్ఎయిడ్ సంస్థ 200 కోట్ల డాలర్ల నిధులు సమకూర్చింది. కొన్నేళ్ళుగా ఆసియా, ఆఫ్రికా, యూరేషియా, ఐరోపా, లాటిన్ అమెరికా, మధ్యప్రాచ్య దేశాల్లో ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణ, పౌరుల భాగస్వామ్యం, సంస్థాగత అభివృద్ధి, ప్రజాస్వామిక స్ఫూర్తి వంటి రంగాల్లో కృషి చేస్తున్నామని సిఇపిపిఎస్ చెప్పుకుంది.
ఆసక్తికరమైన విషయం ఏంటంటే… సిఇపిపిఎస్ వెబ్‌సైట్ కొన్నాళ్ళుగా పనిచేయడం లేదు. యుఎస్ ఎయిడ్ నుంచి కోట్ల డాలర్లు విరాళంగా స్వీకరించిన ఆ సంస్థ 1995 నుంచీ వెబ్‌సైట్ నిర్వహిస్తోంది. ఆ సైట్ 2025 జనవరి 23 నుంచీ పనిచేయడం లేదు.
ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల్లో జోక్యం చేసుకునే సిఇపిపిఎస్:
సిఇపిపిఎస్‌కు సంబంధించిన ఒక డాక్యుమెంట్ ఇటీవల వెలుగు చూసింది. 2023 ఏప్రిల్ 26 నాటి ఆ డాక్యుమెంట్ ప్రకారం వివిధ దేశాల్లో ఎన్నికలు, రాజకీయ ప్రక్రియల నిర్వహణ కోసం యుఎస్ఎయిడ్ సంస్థ సిఇపిపిఎస్‌కు 2వందల కోట్ల నిధులు సమకూర్చింది.
నిజానికి 2021లో సిఇపిఎస్ సేకరించిన నిధుల్లో 66శాతం యుఎస్‌ఎయిడ్ నుంచి వచ్చినవే. ప్రజాస్వామిక దేశాల్లో ఎన్నికలు, రాజకీయ ప్రక్రియల గురించి ఆ సంస్థ సేకరించిన సమాచారాన్ని పరిశీలిస్తే వారి కార్యాచరణ అర్ధమైపోతుంది. ప్రజాస్వామ్య పరిరక్షణ అనే ముసుగులో ప్రపంచంలోని పలు దేశాల ఎన్నికల్లో సిఇపిపిఎస్ తలదూరుస్తుంది, డాలర్ల బలుపుతో ఎన్నికల ఫలితాలను సైతం తారుమారు చేయడానికి ప్రయత్నిస్తుంది. దాన్నిబట్టే, 140కి పైగా దేశాల అంతర్గత రాజకీయ ఎన్నికల్లో సిఇపిపిఎస్ జోక్యం చేసుకుంటోందని అర్ధమవుతుంది.
సిఇపిపిఎస్ కేవలం ఎన్నికల సంఘాలకు సహాయం చేయడం మాత్రమే కాదు. రాజకీయ పార్టీలు, పౌర సమాజం, చివరికి ఎన్నికల పరిశీలన సంస్థల దైనందిన వ్యవహారాల్లో సైతం ప్రత్యక్షంగా తల దూరుస్తుంది. అంటే ఆయా దేశాల రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేసే సామర్థ్యం ఉంది. పైగా సిఇపిపిఎస్ నిర్మాణం ఎలా ఉందంటే ఎంపిక చేసిన కొన్ని రాజకీయ గ్రూపులకు మద్దతు ఇవ్వగలదు, ఎన్నికల ఫలితాలను తమకు అనుకూలంగా మార్చే శక్తీ ఉంది. లేదా ఎన్నికల ఫలితాలను తమకు కావలసినట్లు మార్చేగలదు.
భారత్‌లో సిఇపిపిఎస్ ఉనికి:
సిఇపిఎస్ మూడు విధాలుగా పనిచేస్తుంది. (1) ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఎలక్టోరల్ సిస్టమ్స్ – ఐఎఫ్‌ఈఎస్ (2) ఇంటర్నేషనల్ రిపబ్లికన్ ఇనిస్టిట్యూట్ (3) నేషనల్ డెమొక్రటిక్ ఇనిస్టిట్యూట్. 2018 ఒక్క ఏడాదిలోనే భారత్‌లో జరిగే వేర్వేరు ఎన్నికలకు యుఎస్ఎయిడ్ పెద్దమొత్తంలో నిధులు సమకూర్చినట్లు అర్ధమవుతోంది. ఆ సంస్థ 2018 ఆర్థిక సంవత్సరంలో 318,614 కోట్ల డాలర్లు వ్యయం చేసింది.
ఇప్పుడు అసలైన విషయం తెలుసుకుంటే గుండెలు తరుక్కుపోవడం ఖాయం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో ఐఎఫ్ఇఎస్ సంస్థ అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. అప్పుడు ఎన్నికల కమిషనర్ ఎస్‌వై ఖురేషీ. దానికి నిధులు సమకూర్చినది యుఎస్ ఎయిడ్ ఒకటే కాదు, అనుమానాస్పదంగా వ్యవహరించే మరెన్నో ప్రైవేటు సంస్థలు కూడా నిధులు సమకూర్చాయి.
2012 మే నెలలో భారత ఎన్నికల సంఘం, ఐఎఫ్ఇఎస్‌తో అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. ప్రజాస్వామిక వ్యవస్థలను గెలడం, ఎన్నికల ప్రక్రియను బలోపేతం పేరిట ప్రభావితం చేయడమే ఆ ఒప్పందం లక్ష్యం. అప్పుడు విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం… రెండు సంస్థలూ కలిసి ఉమ్మడి శిక్షణా కార్యక్రమాలు చేపడతాయి, తమ సామర్థ్యాన్ని పెంచుకునే చర్యలు చేస్తుంటాయి. ఆ ఒప్పదం మీద అప్పటి సీఈసీ ఎస్‌వై ఖురేషీ, ఐఎఫ్ఈఎస్ సీఈఓ ప్రెసిడెంట్ విలియం స్వీనీ సంతకాలు చేసారు.
ఆ ఐఎఫ్ఈఎస్ సంస్థకు ప్రధానంగా నిధులు సమకూర్చేది, సిఇపిపిఎస్ ద్వారా యుఎస్ఎయిడ్ సంస్థే అని తెలిసాక, దానికి నిధులు సమకూర్చే మిగతా సంస్థల వివరాలనూ తెలుసుకోవలసిందే. ఆ సంస్థల్లో భారత ఎన్నికల సంఘం, యుఎస్ఎయిడ్, ఆస్ట్రేలియన్ ఎయిడ్ వంటివి ఉన్నాయి.
ఇంక ఐఎఫ్‌ఈఎస్‌కు ప్రైవేటుగా నిధులు సమకూర్చేది ఎవరవంటే గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ మొదలైన సంస్థలు. అందులో ఓపెన్ సొసైటీ నేరుగా జార్జి సోరోస్‌దే. భారత వ్యతిరేకి సోరోస్‌తో మన ఎన్నికల సంఘం ఒప్పందం కుదుర్చుకోవడం ఆందోళన కలిగించేదే. భారత ఎన్నికల ప్రక్రియపై విదేశీ ప్రభావం ఎంత పడిందో అన్న విషయం వల్ల తీవ్ర ఆందోళనలు చెలరేగుతున్నాయి. దాన్నిబట్టి, ఐఎఫ్ఈఎస్ సంస్థ నిజమైన పాత్ర ఏమిటి, దాని లక్ష్యాలు ఏమిటి? భారత ఎన్నికల్లో అది ఎంతవరకూ చొచ్చుకునిపోయింది? అనే అంశాలను తలచుకుంటేనే భయం వేస్తుంది.
ఐఎఫ్ఈఎస్‌తో ఈసీఐ భాగస్వామ్యం 2012తో ముగియలేదు. తర్వాత ఐఎఫ్ఈఎస్ సంస్థ ఐఐఐడీఈఎంలోనూ పెట్టింది. ఆ ఐఐఐఈడీఎంను భారత ఎన్నికల సంఘం 2011లో ఏర్పాటు చేసింది. సీఈసీ ఎస్‌వై ఖురేషీ ఐఎఫ్ఈఎస్‌తో అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నది దాదాపు ఆ సమయంలోనే. ఇక్కడ మనం గమనించాల్సిన సంగతి ఏంటంటే భారత ఎన్నికల సంఘం స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ. అంటే భారత ప్రభుత్వం ఐఎఫ్ఈఎస్‌తో నేరుగా పనిచేయడం లేదు, భారత్ తరఫున ఐఐఐడీఈఎం రంగంలో ఉంది. దాన్నిబట్టే, ఆ వ్యవస్థ చివరికి ఏం చేస్తుందో ఇట్టే ఊహించవచ్చు.