చైనాను శత్రుదేశంలా చూడటం మానేయాలని కాంగ్రెస్ పార్టీ విదేశీ విభాగం అధినేత శ్యామ్ పిట్రోడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన తాజా వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. 2008లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చైనాతో చేసుకున్న ఒప్పందం వల్ల భారత్ 40 వేల చదరపు కి.మీ భూమి కోల్పోవాల్సి వచ్చిందని బీజేపీ నేతలు దుయ్యబట్టారు.
మొదటి నుంచి చైనాను శత్రుదేశంలా చూడటం వల్ల అనేక సరిహద్దు సమస్యలు ఉత్పన్నమయ్యాయని పిట్రోడా అభిప్రాయపడ్డారు. ఇకనైనా చైనాను స్నేహ పూర్వక దేశంగా గుర్తించి, గౌరవించాలని సలహా ఇచ్చారు. చైనాతో ఘర్షణాత్మక వైఖరి అనుసరించడం వల్ల రెండు దేశాల మధ్య శత్రుత్వం పెరిగిందని పిట్రోడా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
అమెరికా నుంచి ట్రంప్ నుంచి వచ్చే ముప్పును ప్రధాని మోదీ ఆపగలరా అంటూ శ్యామ్ పిట్రోడా ప్రశ్నించారు. 40 వేల చదరపు కి.మీ భూమిని చైనాకు అప్పగించిన కాంగ్రెస్ నేతలకు చైనా నుంచి పొంచి ఉన్న ముప్పు కనిపించడం లేదని బీజేపీ సీనియర్ నేత తుహిన్ సిన్హా ఎద్దేవా చేశారు.