ఢిల్లీలో భూకంపం జనాలను పరుగులు పెట్టించింది. ఇవాళ తెలవారుజామున 5 గంటల 30 నిమిషాలకు సంభవించిన భూకంపం వల్ల ప్రజలు భయాందోళనలతో ఇళ్లు వదిలి పరుగులు తీశారు. నొయిడా, గురుగామ్ ప్రాంతాల్లో 3 సెకన్ల పాటు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 4గా నమోదైంది. దేశ్ముఖ్ కాలేజీ సమీపంలో 5 కి.మీ లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఢిల్లీ భూకంపంపై ప్రధాని మోదీ స్పందించారు. మరోసారి ప్రకంపనలు వచ్చే ప్రమాదం పొంచి ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ సూచించారు. పెద్ద శబ్దంతో భూకంపం రావడంతో జనం రోడ్లపై పరుగులు పెట్టారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరిగినట్లు వివరాలు అందలేదు.
బిహార్లోని సివాన్ ప్రాంతంలో మరో భూకంపం ప్రజలను వణికించింది. సోమవారం తెల్లవారుజామున 5 గంటల 35 నిమిషాలకు భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై 4గా నమోదైంది. 10 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.