తమతో పెట్టుకుంటే నిప్పుతో చెలగాటమాడటమేనని తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ హెచ్చరించారు. త్రిభాషా విధానాన్ని తాము రాజకీయం చేస్తోన్నట్లు కేంద్ర మానవవనరుల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడటంపై ఆయన మండిపడ్డారు. భాష, జాతి స్పృహ వచ్చిన తరవాతే తమిళులు రాజకీయాలు ప్రారంభించారని గుర్తుచేశారు.
తమ నడుముకు సిద్ధాతం అనే పంచ వచ్చిన తరవాతే భుజాన పదవి అనే కండువా వచ్చిందని ఉదయనిధి ట్వీట్ చేశారు. తమకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులే అడుగుతున్నామని గుర్తుచేశారు. మీరు ఇచ్చే స్థానంలో, తాము తీసుకునే స్థానంలో ఉన్నామని తక్కువ చేసి చూడవద్దని హితవు పలికారు.
తమిళ ప్రజలను రెచ్చగొట్టడం అంటే నిప్పుతో చెలగాట మాడటమేనన్నారు. స్వాతంత్రం వచ్చాక చరిత్ర పరిశీలిస్తే ఈ విషయం అర్థం అవుతుందన్నారు. మా పిల్లల చదువులకు నిధులు అడుగుతున్నామని, మాకు రావాల్సిన నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.