మహాకుంభమేళాకు యాత్రీకులు పోటెత్తారు. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతోన్న మహాకుంభమేళాలో ఇప్పటి వరకు 50 కోట్ల మంది పుణ్య స్నానాలు చేశారు. మరోవారంలో కుంభమేళా ముగియనుంది. దీంతో దేశంలోని పలు రాష్ట్రాల నుంచి యాత్రీకులు పోటెత్తారు. ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే రహదారులన్నీ వాహనాలతో నిండిపోయాయి. రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోయాయి.
మధ్యప్రదేశ్ సరిహద్దు నుంచి ప్రయాగ్‌రాజ్ వెళ్లే రహదారులన్నీ యాత్రీకులతో కూడిన వాహనాలతో నిండిపోయాయి. జాతీయ రహదారులపై 300 కి.మీ మేర ట్రాఫిక్ జాం ఏర్పడింది. భక్తులు ఒక్కసారిగా పెరగడంతో పలు రాష్ట్రాలు ప్రత్యేక చర్యలు చేపట్టాయి.
న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట ఘటన తరవాత పలు స్టేషన్లలో పోలీసు బలగాలను దింపారు. యాత్రీకులను నియంత్రిస్తున్నాయి. ఢిల్లీ రైల్వే స్టేషన్లో తప్పుడు సమాచారం ప్రకటన చేయడం వల్లే ప్రమాదం జరిగిందని గుర్తించారు. తొక్కిసలాటలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించారు.