గొప్పగొప్ప కళాకారులను సినీ పరిశ్రమకు పరిచయం చేసిన ప్రముఖనటి
ఎన్టీఆర్ తొలి సినిమా మనదేశానికి నిర్మాత
ఘంటసాలకు తొలి అవకాశం కల్పించిన కృష్ణవేణి
తెలుగు సినీ పరిశ్రమకు ఎనలేని కీర్తి తెచ్చిపెట్టిన వారిలో ఒకరైన నటి, నిర్మాత కృష్ణవేణి కన్నుమూశారు. ఆమె 102 ఏళ్ల వయస్సులో అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఫిల్మ్ నగర్‌లోని నివాసంలో ఆమె ప్రాణాలు వదిలారు.
తెలుగు చిత్ర పరిశ్రమకు ఆమె గొప్ప కళాకారులను పరిచయం చేశారు. నిర్మాతగా’మనదేశం’ సినిమాతో సీనియర్ ఎన్టీఆర్‌ను సినిమా రంగానికి పరిచయం చేశారు. సంగీత దర్శకుడు ఘంటసాలకు కూడా తొలి అవకాశం కల్పించింది ఆమెనే. .
పశ్చిమ గోదావరి జిల్లా పంగిడిలో జన్మించిన కృష్ణవేణి నాటకరంగంలో పనిచేశారు. 1936లో ‘అనసూయ’ అనే సినిమాలో బాల నటిగా మెప్పించారు. నేపథ్య గాయనిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
కృష్ణవేణి మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.