శబరిమల ఆలయ అభివృద్ధిలో భాగంగా కొత్త డిజైన్ రూపొందించారు. సన్నిధానం చుట్టూ గతంలో ఉన్న ఫ్లైఓవర్ ను తొలగించనున్నారు. దీంతో ఇరుముడితో వెళ్ళే భక్తులు పవిత్రమైన 18 మెట్లు ఎక్కగానే స్వామి దర్శనం అవుతోంది. ఇప్పటి వరకు పదునెట్టాంబడి ఎక్కిన తర్వాత భక్తులను ఎడమవైపుకు మళ్లించేవారు. అక్కడి నుంచి 500 మీటర్ల ఫ్లై ఓవర్ మీదుగా సన్నిధానం చేరుకోవాలి. ప్రస్తుతం వంతెనను తొలగించడంతో నేరుగా స్వామి దర్శనం అవుతోంది.
మీనమాస పూజల కోసం అయ్యప్ప ఆలయాన్నిమార్చి 14న తెరవనున్నారు.ఇరుముడితో వెళ్లే భక్తులు 18 మెట్లు ఎక్కగానే నేరుగా ధ్వజ స్తంభానికి ఇరువైపులా రెండు, నాలుగు లైన్ల దారిలోకి అనుమతిస్తారు. అక్కడి నుంచి నేరుగా బలికల్పుర (కణిక్కవంచి-నైవేద్య పాత్ర) మీదుగా ఎదురుగా కొలువైన స్వామిని దర్శించుకోవచ్చు.
తాజా డిజైన్తో కణిక్కవంచి నుంచి వెళ్తే 30 సెకన్ల నుంచి నిమిషం పాటు అయ్యప్ప స్వామి దర్శించుకునే అవకాశం ఉంది. శబరిమలలో ప్రస్తుతం కుంభమాస పూజలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 21 వరకు ఆలయం తెరిచే ఉంచుతారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు 1989లో ఏర్పాటు చేసిన బ్రిడ్జిని తొలగించే పనులు ప్రారంభం అయ్యాయి.