బీరు డబ్బాలపై మహాత్మాగాంధీ పోటోలు ముద్రవేయడం తీవ్ర కలకలం రేగింది. రష్యాకు చెందిన రివర్ట్ బ్రాండ్ బీరు డబ్బాలపై మహాత్మాగాంధీ చిత్రాలు దర్శనమిచ్చాయి. ఈ విషయాన్ని ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నందిని సత్పతి మనవడు సుపర్ణో సత్పతి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇదే విషయాన్ని భారత విదేశాంగశాఖ అధికారులు రష్యాతో సంప్రదింపులు జరుపుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో చర్చించాలంటూ సుపర్ణో సోషల్ మీడియాలో ప్రధానికి ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు.మద్యపానానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన మహాత్ముడి చిత్రాలు బీరు డబ్బాలపై ముద్రించడంపై సోషల్ మీడియాలో పలువురు కామెంట్లు చేశారు. వ్యాపారం కోసం మహాత్మాగాంధీని ఇలా బీరుడబ్బాలపై ముద్రించడాన్ని వేలాది మంది ఖండించారు.
సదరు కంపెనీపై కేసు నమోదు చేయాలంటూ నెటిజన్లు విరుచుకుపడ్డారు. పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ దీనిపై స్పందించాలని పలువురు డిమాండ్ చేశారు. 2019లో ఇజ్రాయెల్‌కు చెందిన ఓ కంపెనీ ఇలాంటి ప్రయోగం చేసి చివరకు క్షమాపణలు కోరింది. 2015లో ఓ అమెరికన్ కంపెనీ కూడా ఇలా మహాత్మాగాంధీ (mahatma gandhi) ఫోటోలను మద్యం సీసాలపై ప్రచురించి అరాచకానికి పాల్పడింది. వివాదం ముదరడంతో క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే.