దేశంలో మద్యం తాగే ఆడవాళ్ళ సంఖ్య ఎక్కువగానే ఉంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేలింది. దేశంలో రాష్ట్రాల వారీగా మద్యం వినియోగం, ? మహిళల సంఖ్యపై సర్వేలో పలు కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. అత్యధికంగా మద్యం తాగే జాబితాలో ఈశాన్య రాష్ట్రాలు అగ్రస్థానంలో ఉన్నాయి. మహిళల విషయానికి వస్తే అస్సాం తొలి స్థానంలో ఉంది.
దేశవ్యాప్తంగా 15-49 సంవత్సరాల వయస్సు గల్గిన మహిళల్లో సగటు మద్యపానం 1.2 శాతం ఉండగా అస్సాంలో ఈ సగటు 16.5 శాతానికి దగ్గరైంది. అస్సాం తర్వాతి స్థానంలో మేఘాలయ ఉంది. అక్కడ 8.7 శాతం మంది మద్యానికి అలవాటు అయ్యారు. అరుణాచల్ ప్రదేశ్ మూడో స్థానంలో ఉంది. అక్కడ 3.3 శాతం మంది మహిళలు మద్యం తాగుతుండగా 59 శాతం మంది పురుషులు ఆల్కహాల్ తాగుతున్నారు. సిక్కింలో 0.3 శాతం, ఛత్తీస్గర్ లో 0.2 శాతం మంది బానిసయ్యారు.
గతంలో మహిళల మద్యపాన రేటు అధికంగా ఉన్న జార్ఖండ్, త్రిపురలో ఈ సారి గణనీయమైన తగ్గుదల కనిపించింది. జార్ఖండ్ లో గతంలో 9.9 శాతంగా ఉండగా ప్రస్తుతం0.3 శాతానికి తగ్గింది. త్రిపురలో 9.6 శాతం నుంచి 0.8కి పడిపోయింది.