కాల్పుల విరమణ ఒప్పందం తరవాత పాలస్తీనాకు చెందిన హమాస్ ఉగ్రవాదులు తాజాగా మరో ముగ్గురు బందీలను విడుదల చేశారు. శనివారంనాడు ముగ్గురు బందీలను రెడ్‌క్రాస్ ప్రతినిధులకు అప్పగించారు. వారిలో అలెగ్జాండర్, హార్న్, సాగుయ్ డెకెల్ చెన్ ఉన్నారు.
గత నెల కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా ఇప్పటి వరకు హమాస్ ఉగ్రవాదులు 34 మంది బందీలను విడుదల చేశారు. ప్రతిగా 739 మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేసింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘిస్తుందంటూ ఇటీవల పాలస్తీనాకు చెందిని హమాస్ ఉగ్రవాదులు బందీలను విడుదల చేయడం నిలిపిశారు. దీంతో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సీరియస్ అయ్యారు. వారంలో బందీలను విడుదల చేయకుంటే తీవ్ర చర్యలుంటాయని హెచ్చరించారు. దీంతో హమాస్ ఉగ్రవాదులు దిగివచ్చారు.
ఈజిప్ట్, ఖతర్ దేశాలు జరిపిన దౌత్యం ఫలించింది. ఇప్పటి వరకు 34 మంది బందీలను హమాస్ ఉగ్రవాదులు విడుదల చేయగా, ఇంకా 60పైగా బందీలను విడుదల చేయాల్సి ఉంది. ఇజ్రాయెల్ 1700 ఖైదీల్లో ఇప్పటికే 730 మందిని విడుదల చేసింది. రాబోయే వారం రోజులు బందీల్లో చాలా మందిని విడుదల చేసే అవకాశ కనిపిస్తోంది.