ఎన్నికల వాగ్దానాల నెరవేర్చడంలో అన్ని పార్టీల కంటే బీజేపీ ముందుంటుందని మరోసారి రుజువైంది. తమ సిద్ధాంతాలను మేనిఫెస్టోలో ఉంచి ప్రజల ముందు ఉంచడం అధికారమిస్తే వాటిని నెరవేర్చడంలో తమకు ఎవరూ సాటిలేరని ఆపార్టీ మరోసారి నిరూపించుకుంది.
దిల్లీ ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లుగానే అధికారంలోకి వచ్చిన వెంటనే వందరోజలు కార్యాచరణను సిద్ధం చేసింది. అలాగే ఆప్ హయాంలో జరిగిన అవినీతిపై చర్యలకు సిద్ధమైంది.
ఆప్ అధినేత కేజ్రీవాల్ అద్దాల మేడ వ్యవహారంపై విచారణకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దిల్లీ సీఎం అధికారిక నివాసమైన శీష్ మహల్ (అద్దాలమేడ)లో అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా ఉన్నప్పుడు బంగ్లా పునరుద్ధరణ పేరిట భారీగా అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ అంశం పై అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కీలక చర్చ జరిగింది.
6 ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్‌లో సుమారు 40 వేల చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ బంగ్లా ఆధునికీకరణ కోసం నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలు ఉన్నాయి. రూ.80 కోట్ల ప్రజాధనంతో మరమ్మతులు చేపట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. టాయిలెట్‌లో గోల్డెన్ కమోడ్, స్విమ్మింగ్ పూల్, మినీ బార్ వంటివి ఏర్పాటు చేసుకున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ బంగ్లాకు దిల్లీ నూతన సీఎం దూరంగా ఉంటారని బీజేపీ ఇప్పటికే ప్రకటించింది.
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాభవం చెందగా 70 స్థానాలకు గానూ బీజేపీ 48 స్థానాల్లో విజయం సాధించింది. ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 22 స్థానాల్లోనే విజయం సాధించిందది. ఈ నెల 19, లేదా 20 తేదీల్లో దిల్లీ కొత్త సీఎం ప్రమాణస్వీకారం ఉంటుంది.
మండలిలో మంత్రి లోకేశ్ మాజీ మంత్రి బొత్స వాగ్వాదం : ఇంగ్లీషు వీరికి అర్థం కావడం లేదంటూ లోకేశ్ ఎద్దేవా