భారత ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ గా జ్ఞానేశ్ కుమార్ ఎంపికకానున్నారు. ప్రస్తుత సీఈసీ రాజీవ్ కుమార్ ఫిబ్రవరి 18న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో కొత్త సీఈసీని ఎన్నుకునేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ ఫిబ్రవరి 17న సమావేశం కానుంది. ఈ కమిటీలో ప్రధాని మోదీతో పాటు కేంద్ర న్యాయ మంత్రి అర్జున్ రామ్ మేఘల్, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సభ్యులుగా ఉన్నారు.
సెర్చ్ కమిటీ రూపొందించిన జాబితా నుంచి ప్రధాని నేతృత్వంలోని కమిటీ ఒకరి పేరును ఎంపిక చేయనుంది. ఈ ఎంపిక ఆధారంగా రాష్ట్రపతి తదుపరి సీఈసీ నియామకానికి ఆమోదం తెలుపుతారు. ప్రస్తుత సీఈసీ పదవీ విరమణ తర్వాత ఎన్నికల సంఘంలోని అత్యంత సీనియర్ కమిషనర్‌కు సీఈసీగా పదోన్నతి కల్పించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ క్రమంలోప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా సేవలందిస్తున్న జ్ఞానేశ్ కుమార్ ముందున్నారు. ఆయన కేరళ కేడర్‌కు చెందిన 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి.
రాజీవ్ కుమార్ మే 15, 2022న సీఈసీగా బాధ్యతలు చేపట్టారు. లోక్ సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు రాజీవ్ కుమార్ హయాంలోనే జరిగాయి. అయితే ఆయన బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నట్లు కాంగ్రెస్ సహా ఎన్డీ కూటమిలోని పలు పార్టీలు విమర్శలు చేశాయి.
ఈ ఏడాది చివరిలో జరిగే బీహార్ ఎన్నికలు, వచ్చే ఏడాదిలో జరిగే తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ అసెంబ్లీ ఎన్నికలు కొత్త సీఈసీ ఆధ్వర్యంలో జరగనున్నాయి. అయితే, ఈ ఎన్నికలు కొత్త సీఈసీ ఆధ్వర్యంలోనే జరగనున్నాయి.